Site icon vidhaatha

Cheruku Sudhakar | కింది కోర్టుకు వెళ్లండి.. చెరుకుకు హైకోర్టు సూచన

విధాత: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నల్గొండ జిల్లా చెందిన కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar), ఆయన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయసింహరెడ్డి పోలీసులు కేసు నమోదు చేయని పక్షంలో కింది కోర్టును ఆశ్రయించవచ్చు అని పేర్కొన్నారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వెంకటరెడ్డి ఫోన్లో చెరుకు సుధాకర్ ను, ఆయన కుమారుడిని చంపుతాను అంటూ బెదిరించిన ఘటనలో సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకట్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ సమస్యపై కింది కోర్టుకు వెళ్లాలని సూచించడం గమనార్హం.

Exit mobile version