Gold Prices: పెళ్లిళ్ల సీజన్..అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు దారులకు స్వల్ప ఊరట లభించింది. బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.50తగ్గి రూ. 89,750వద్ధ ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60తగ్గి రూ.97,910వద్ధ కొనసాగుతోంది. బెంగుళూరు, చైన్నై, ముంబైలలో అదే ధర కొనసాగుతోంది. న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ. 89,900, 24క్యారెట్లకు రూ.98.040వద్ధ కొనసాగుతోంది.
దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.85,528గా, 24క్యారెట్లకు రూ.92,366గా ఉంది. అమెరికాలో రూ.85,146గా, రూ.90,894గా ఉంది.
కిలో వెండి ధర బుధవారంహైదరాబాద్ మార్కెట్ లో గణనీయంగా రూ.2000తగ్గింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,09,000గా కొనసాగుతోంది. గత పది రోజులలో చూస్తే వెండి ప్రస్తుత ధరనే తక్కువగా ఉండటం విశేషం.