Gold Rate |
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు మంగళవారం స్వల్పంగా దిగివచ్చాయి.
22 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గి.. తులం రూ.56,290 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 తగ్గుదల నమోదై రూ.61,410కి తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,440 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,560 ధర పలుకుతున్నది.
హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 గ్రాము పసడి రూ.56,290 ఉండగా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రూ.61,410కి తగ్గింది.
ఏపీలో విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి రూ.300 తగ్గి రూ.7500కు చేరింది.
హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,600గా ఉన్నది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
అమెరికా రుణాల పరిమితిపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో బంగారం ధరలు సైతం ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,970 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.