NEET PG | MBBS అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. ఇంట‌ర్న్‌షిప్ క‌టాఫ్ తేదీ పొడిగింపు

NEET PG | నీట్ పీజీ-2023 ప‌రీక్ష రాసే ఎంబీబీఎస్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌. ఈ ప‌రీక్షకు హాజ‌ర‌య్యేందుకు త‌ప్ప‌నిస‌రిగా పూర్తి చేయాల్సిన ఎంబీబీఎస్ ఇంట‌ర్న్‌షిప్‌(సంవ‌త్స‌ర కాలం) క‌టాఫ్ తేదీని ఆగ‌స్టు 11 వ‌ర‌కు కేంద్రం పొడిగించింది. దీంతో తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల విద్యార్థుల‌కు ఊర‌ట ల‌భించింది. ప‌లు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి […]

  • Publish Date - February 8, 2023 / 04:47 AM IST

NEET PG | నీట్ పీజీ-2023 ప‌రీక్ష రాసే ఎంబీబీఎస్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌. ఈ ప‌రీక్షకు హాజ‌ర‌య్యేందుకు త‌ప్ప‌నిస‌రిగా పూర్తి చేయాల్సిన ఎంబీబీఎస్ ఇంట‌ర్న్‌షిప్‌(సంవ‌త్స‌ర కాలం) క‌టాఫ్ తేదీని ఆగ‌స్టు 11 వ‌ర‌కు కేంద్రం పొడిగించింది. దీంతో తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల విద్యార్థుల‌కు ఊర‌ట ల‌భించింది. ప‌లు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది.

ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంట‌ర్న్‌షిప్ పూర్త‌య్యేవారే నీట్ పీజీ -2023 ప‌రీక్ష‌కు అర్హుల‌ని కేంద్రం గతంలో పేర్కొంది. ఆ కటాఫ్ తేదీని జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తూ జ‌న‌వ‌రి 13న నోటిఫికేష‌న్ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌. తాజాగా మ‌రోసారి క‌టాఫ్ తేదీని పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ‌లోని 4 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థుల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అర్హులైన అభ్య‌ర్థులు నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. ప‌రీక్ష మార్చి 5వ తేదీన జ‌ర‌గ‌నుంది.

Latest News