Site icon vidhaatha

తిరుమల: శ్రీవారి భక్తులకు శుభ‌వార్త‌.. స్కాన్‌ చేస్తే అన్ని వివరాలు

విధాత‌: శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు టీటీడీ శుభ‌వార్త చెప్పింది. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. ఇకపై ఎవరినీ అడగకుండానే కొండపై ఒకచోట నుంచి మరో చోటకు చేరుకోవచ్చ‌ని తెలిపింది. దీనికి సంబంధించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టీటీడీ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.

తిరుమలలోని వివిధ కార్యాలయాలను తెలిపే క్యూఆర్‌ కోడ్‌ను రూపొందించింది. క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే చాలు.. టీటీడీ అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌.. ఇలా అన్ని విభాగాల వివరాలు ప్రత్యక్షం కానున్నాయి. భక్తులు తాము వెళ్లాల్సిన చోటుపై క్లిక్‌ చేస్తే మ్యాప్‌ కూడా డిస్‌ప్లే అవుతుంది

Exit mobile version