Google Play | గూగుల్ ప్లేస్టోర్ నుంచి 101 యాప్‌లు తొలగింపు.. మీ ఫోన్ల నుంచి వీటిని వెంట‌నే తొల‌గించండి

Google Play | విధాత: యూజ‌ర్ల డేటాను త‌స్క‌రించ‌డం, వారిపై నిఘా పెడుతున్నాయ‌న్న కార‌ణంతో గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store) మొత్తం 101 యాప్‌ల‌ను తొల‌గించింది. వీటిలో ఇప్ప‌టికే వేటినైనా వాడుతూ ఉన్న‌ట్ల‌యితే త‌క్ష‌ణం వాటిని అన్ఇన్‌స్టాల్ చేయాల‌ని సూచించింది. వాటిలో ప్ర‌ముఖ 15 యాప్‌ల వివ‌రాలు ఇవి.. నాయిజ్: వీడియో ఎడిట‌ర్ విత్ మ్యూజిక్‌ ఈ యాప్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీని పేరులో ఉన్నట్టే వీడియోను ఎడిట్ చేయ‌డానికి […]

  • Publish Date - June 15, 2023 / 04:27 AM IST

Google Play |

విధాత: యూజ‌ర్ల డేటాను త‌స్క‌రించ‌డం, వారిపై నిఘా పెడుతున్నాయ‌న్న కార‌ణంతో గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store) మొత్తం 101 యాప్‌ల‌ను తొల‌గించింది. వీటిలో ఇప్ప‌టికే వేటినైనా వాడుతూ ఉన్న‌ట్ల‌యితే త‌క్ష‌ణం వాటిని అన్ఇన్‌స్టాల్ చేయాల‌ని సూచించింది. వాటిలో ప్ర‌ముఖ 15 యాప్‌ల వివ‌రాలు ఇవి..

నాయిజ్: వీడియో ఎడిట‌ర్ విత్ మ్యూజిక్‌

ఈ యాప్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీని పేరులో ఉన్నట్టే వీడియోను ఎడిట్ చేయ‌డానికి బోలెడ‌న్ని ఆప్ష‌న్ల‌తో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. ఏఐతో ప‌నిచేసే ఫీచ‌ర్లు, ఫిల్ట‌ర్లు దీని సొంతం

జాప్యా: ఫైళ్ల బ‌దిలీ

దీనికి కూడా కోటి డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. ఫైళ్ల‌ను సులువుగా ఇత‌రుల‌తో పంచుకోడానికి దీనిని రూపొందించారు.

వీఫ్లై: వీడియో ఎడిట‌ర్‌, వీడియో మేక‌ర్‌

సుమారు 50 ల‌క్ష‌ల డౌన్‌లోడ్‌లున్న ఈ యాప్‌… వీడియోల‌ను ఎడిట్ చేసుకోడానికి, స్పెష‌ల్ ఎఫెక్ట్‌లు జోడించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఎంవి బిట్: ఎంవి వీడియో స్టేట‌స్ మేక‌ర్‌

ఇది కూడా ఎడిటింగ్ యాప్‌.. 50 ల‌క్ష‌ల డౌన్‌లోడ్‌ల‌తో ఫేమ‌స్ యాప్‌గా ఉంది.

బియ్‌గో: వీడియో మేక‌ర్‌, వీడియో ఎడిట‌ర్‌

ఇందులో యూజ‌ర్లు ఫ‌న్ చేసుకోచ్చు, వీడియోల‌ను రూపొందించొచ్చు. దీనిని ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల మంది ఉప‌యోగిస్తున్నారు.

క్రేజీ డ్రాప్‌:

ఇది ఒక గేమింగ్ యాప్‌. క్యాండీ క్రష్ త‌ర‌హాలో ఉండే ఈ యాప్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 10 ల‌క్ష‌ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

క్యాష్‌జీనీ: ఎర్న్ మ‌నీ రివార్డ్‌

ఇదో వెరైటీ యాప్‌. ఇందులో ఉండే న‌వ‌ల్స్‌ని, పుస్త‌కాల‌ను చ‌దివితే గోల్డ్ కాయిన్లు మ‌న వాలెట్‌లో యాడ్ అవుతాయి. వాటిని డ‌బ్బు రూపంలోకి మార్చుకుంటే మ‌న అకౌంట్‌లో జ‌మ‌వుతాయి.

ఫిజో న‌వ‌ల్‌: రీడింగ్ ఆఫ్‌లైన్‌

ఈ యాప్ ఆఫ్‌లైన్‌లో పుస్త‌కాలు, న‌వ‌ల్స్ చ‌దువుకోడానికి అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇప్ప‌టికే 10 ల‌క్ష‌ల మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

క్యాష్ ఈఎం: గెట్ రివార్డ్‌

ఇందులో ఉండే సులువైన గేంలను ఆడితే.. డ‌బ్బులు అకౌంట్‌లో జ‌మ‌వుతాయి. దీనిని 5 ల‌క్ష‌ల మంది ఉప‌యోగిస్తున్నారు.

టిక్‌: వాచ్ టు ఎర్న్‌

ఇందులో ఉన్న వీడియోల‌ను చూస్తే రివార్డుల‌ను ఇస్తుంది. వాటిని నిజ‌మైన డ‌బ్బులుగా మార్చుకోవ‌చ్చు. ఇప్ప‌టికే దీనికి 5 ల‌క్ష‌ల డౌన్‌లోడ్‌లు ఉన్నాయి.

ఇవే కాకుండా వైబ్ టిక్‌, మిష‌న్ గురు, ల‌క్కీజాక్‌పాట్ పుష‌ర్‌, డామినో మాస్ట‌ర్ త‌దిత‌ర యాప్‌ల‌నూ ప్లేస్టోర్ నిషేధించింది. వీటిలో ఏదైనా యాప్‌ను మీరు వాడుతుంటే.. వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయ‌డం మంచిది.

Latest News