విధాత : తెలంగాణ గురుకుల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ (TGPA) సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ చెందిన పైళ్ల ప్రకాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయనను టీజీపీఏ సభ్యులు అభినందిస్తూ… గురుకుల విద్యా వ్యవస్థలో అనుభవజ్ఞుడిగా, విద్యాపరమైన సమస్యలపై లోతైన అవగాహన కలిగిన నాయకుడిగా పైళ్ల ప్రకాశ్ రెడ్డి నూతను బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
గతంలో వివిధ స్థాయిల్లో గురుకుల విద్యాసంస్థల అభివృద్ధికి ప్రిన్సిపల్స్ , సిబ్బంది సమస్యల పరిష్కారానికి తీసుకున్న చొరవ ఆయనను టీజీపీఏ సెంట్రల్ సెక్రటరీ స్థాయికి చేర్చిందన్నారు. ఈ సందర్భంగా వలిగొండకు చెందిన విద్యాసంస్థల ప్రతినిధులు, నాయకులు కాసుల వెంకన్న, పబ్బు వెంకటరమణ, గరిసె రవి, పాలకూర వెంకటేశం, గంగాధర్ దయాకర్, నూతనగంటి వెంకటేశం, బెలిదే శ్రీనివాస్ లు ప్రకాశ్ రెడ్డికి తమ అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి :
Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో
Andhra Pradesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ ఖాళీ!
