Andhra Pradesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ ఖాళీ!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖలో నిధుల కొరత తీవ్రంగా బయటపడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీల గౌరవ వేతనాల చెల్లింపులపై హైకోర్టులో ప్రభుత్వం నిధుల్లేవని తెలిపింది.

Andhra Pradesh High Court

విధాత, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ కాసుల కరువుతో అల్లాడుతుంది. పంచాయతీ రాజ్ శాఖ ఖజానా ఖాళీ అయ్యిందని, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ హైకోర్టుకు ఆ ఆ శాఖ నివేదించడం హాట్ టాపిక్ గా మారింది.

2024 జూన్ నుంచి తమకు గౌరవ వేతనం చెల్లించడం లేదంటూ ఏపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి గౌరవ వేతనం ఎందుకు చెల్లించలేదో ప్రమాణపత్రం సమర్పించాలని ఆదేశించింది. బదులుగా పంచాయతీ రాజ్‌ శాఖ తమ ఖజానాలో నిధులు లేవని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం ఏపీలోని అధికార టీడీపీ జనసేన, బీజేపీ కూటమికి ఇబ్బందికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డికి వరుస షాక్ లు.. సుశీ ఇన్ ఫ్రాపై సీబీఐ కేసు !
Kaleshwaram PC Ghosh Report Case : కాళేశ్వరం ఘోష్ కమిషన్ రిపోర్టు కేసు విచారణ వచ్చే నెల 25కు వాయిదా

Latest News