AP High Court : జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైసీపీకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, పులివెందుల & ఒంటిమిట్ట జడ్పీటీసీ రీపోలింగ్ పై వైసీపీ పిటిషన్ డిస్మిస్ చేసి ఎన్నికల కమిషన్ నిర్ణయానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ap-high-court-dismisses-ycp-zptc-repoll-petition

AP High Court | అమరావతిత : పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేతలు వేసిన పిటిషన్ లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్న కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టీకరించింది. పులివెందుల, ఒంటిమిట్టలలో అధికార టీడీపీ అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని..ప్రజాస్వాయ్య బద్ధంగా ఎన్నికలు జరుగనందునా రీపోలీంగ్ నిర్వహించాలని ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధులు హేమంత్ రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు.

వారి పిటీషన్లను విచారించిన కోర్టు దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ పిటీషన్లను డిస్మిస్ చేసింది. దీంతో అటు రెండు జడ్పీటీసీ స్థానాల్లో ఓడిపోయిన వైసీపీకి హైకోర్టు నిర్ణయం మరింత నిరాశ పరిచింది.

ఇవి కూడా చదవండి…

“వార్ 2” సమీక్ష – హృతిక్–ఎన్టీఆర్ యాక్షన్ హంగామా, లోపించిన కొత్తదనం

శ్రీశైలం జ‌లాశ‌యానికి పోటెత్తిన వ‌ర‌ద‌.. ఏడు గేట్లు ఎత్తివేత‌