హైదరాబాద్, సెప్టెంబర్ 5(విధాత): నీట్(NEET) పరీక్ష క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ప్రజాభవన్‌లో(Praja Bhavan) మంత్రి సీతక్కను(Seethakka) కలిశారు. నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించినా సుప్రీకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్‌కు హాజరు కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ(Telangana) బిడ్డలమైనప్పటికీ కేవలం ఇంటర్మీడియట్ పొరుగు రాష్ట్రాల్లో చదవడం కారణంగా తాము నష్టపోతున్నామని విద్యార్థులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల అభ్యర్థనను విన్న సీతక్క(Seethakka) సంబంధిత శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్కకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.