మేడారం జాతరకు మేం వస్తాం: మంత్రి సీతక్కతో ఖర్గే, రాహుల్

మేడారం జాతరకు ఆహ్వానం అందితే తప్పక వస్తామని ఖర్గే, రాహుల్ గాంధీ మంత్రి సీతక్కకు హామీ ఇచ్చారు. సమ్మక్క–సారలమ్మల చరిత్రపై ఆమెతో ఆసక్తికరంగా చర్చించారు.

న్యూఢిల్లీ : ఢిల్లీలో తెలంగాణ సీఎం, మంత్రులతో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ల సమావేశం…మేడారం జాతర నిర్వహణపై మంత్రి సీతక్కతో సరదా సంభాషణకు వేదికైంది.మేడారం జాతరను ఘనంగా నిర్వహించడం పట్ల మంత్రి సీతక్కను ఖర్గే, రాహుల్ లు అభినందించారు. ఆదివాసీ అతిపెద్ద జాతర మేడారంపై పది నిమిషాల పాటు సీతక్కతో చర్చించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యంపై సీతక్కను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాట గాథను ఆసక్తిగా విన్నారు. ఈ సందర్బంగా సమ్మక్క–సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా చాటేలా సినిమా తీయాలని రాహుల్ గాంధీ సూచించడం విశేషం.

మేడారం జాతరకు ఆహ్వానిస్తే తాము కూడా తల్లుల దర్శనానికి తప్పక వచ్చవారమని రాహుల్ గాంధీ, ఖర్గేలు సీతక్కతో తెలిపారు. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. వచ్చే జాతరకు తప్పకుండా అధికారిక ఆహ్వానం అందిస్తామని తెలిపారు. ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్ గాంధీ, ఖర్గే హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

Leopard Attack | షాకింగ్‌.. బైక‌ర్‌పైకి దూకిన చిరుత‌.. అత‌డు ఏం చేశాడో చూడండి..?
PM Modi : ఏఐ అవకాశం..ఆటంకం కాదు : ప్రధాని మోదీ

Latest News