Site icon vidhaatha

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సాగర్ కాల్వకు గండి: ఎంపీ ఉత్తమ్

విధాత, నల్గొండ: నాగార్జున సాగర్ కాలువల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే ఎడమ కాల్వకు గండి పడిందని యుద్ధప్రాతిపదికన గండి మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

శనివారం ఆయన సాగర్ కాలువ గండిపడిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ కాలువ గండిని వెంటనే మరమ్మతులు చేపట్టని పక్షంలో నాగార్జున సాగర్ ఆయకట్టు 6.3లక్షల ఎకరాలు ఎండి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి 8 గంటలు మాత్రమే కరెంటు వస్తోందని, ప్రభుత్వం 24 గంటలు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తోందని అక్కడి రైతులు ఉత్తమ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి సారిస్తానని ఎంపీ తెలిపారుగండి పడిన సమయంలో ముంపునకు గురైన వ్యవసాయ పొలాలు, ఇళ్లకు పరిహారం వెంటనే చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Exit mobile version