TSPSC | గ్రూప్‌-4 హాల్ టికెట్లు విడుద‌ల‌.. ఈ రాత‌ప‌రీక్ష‌కు కూడా గ్రూప్-1 నిబంధ‌న‌లే..

TSPSC | Group 4 విధాత: తెలంగాణ‌లో గ్రూప్-4 రాత‌ప‌రీక్ష‌కు టీఎస్‌పీఎస్సీ స‌ర్వం సిద్ధం చేసింది. ఈ నేప‌థ్యంలో జులై 1న నిర్వ‌హించే గ్రూప్-4 ప‌రీక్ష‌కు సంబంధించి టీఎస్‌పీఎస్సీ హాల్ టికెట్ల‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 8,180 పోస్టుల‌కు గానూ 9.51 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. దీంతో అభ్య‌ర్థుల‌ను స‌ర్దుబాటు చేసేందుకు మండ‌ల కేంద్రాల్లోనూ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. జులై 1న ఉద‌యం, మ‌ధ్యాహ్నం రెండు సెష‌న్ల‌లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 10 నుంచి 12.30 […]

  • Publish Date - June 24, 2023 / 09:48 AM IST

TSPSC | Group 4

విధాత: తెలంగాణ‌లో గ్రూప్-4 రాత‌ప‌రీక్ష‌కు టీఎస్‌పీఎస్సీ స‌ర్వం సిద్ధం చేసింది. ఈ నేప‌థ్యంలో జులై 1న నిర్వ‌హించే గ్రూప్-4 ప‌రీక్ష‌కు సంబంధించి టీఎస్‌పీఎస్సీ హాల్ టికెట్ల‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 8,180 పోస్టుల‌కు గానూ 9.51 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

దీంతో అభ్య‌ర్థుల‌ను స‌ర్దుబాటు చేసేందుకు మండ‌ల కేంద్రాల్లోనూ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. జులై 1న ఉద‌యం, మ‌ధ్యాహ్నం రెండు సెష‌న్ల‌లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది.

నిబంధ‌న‌లు ఇవే..

హాల్ టికెట్‌తో పాటు పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓట‌ర్ ఐడీ, ఆధార్ కార్డు, గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డును క‌చ్చితంగా ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద చూపించాలి.

హాల్ టికెట్‌పై ఫోటో, సంత‌కం లేని యెడ‌ల‌.. ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్ప‌టి ఫోటోను అతికించి అటెస్టెడ్ చేయించాల‌ని సూచించారు.

ప‌రీక్షా కేంద్రాలు ఉద‌యం 8 గంట‌ల‌కు తెరిచి ఉంచుతారు. ఇక ఉదయం, మ‌ధ్యాహ్నం సెష‌న్ల‌లో ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ల‌ను మూసేయ‌నున్నారు. గేట్లు మూసిన త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అభ్య‌ర్థుల‌ను అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

క్యాలికులేట‌ర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ డివైజెస్, వాచ్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్స్, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు అనుమ‌తి లేదు.

ప్ర‌తి అభ్య‌ర్థి క‌చ్చితంగా చెప్పులు మాత్ర‌మే వేసుకొని రావాలి. షూ ధ‌రిస్తే అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే ఇటీవ‌ల జ‌రిగిన గ్రూప్-1 ఎగ్జామ్ రోజు.. బెల్ట్‌ల‌ను, బైక్ కీస్‌ను కూడా పోలీసులు అనుమ‌తించ‌లేదు. ఈ విష‌యాన్ని హాల్‌టికెట్‌లో ఎక్క‌డా పొందుప‌ర‌చ‌న‌ప్ప‌టికీ.. పోలీసులు మాత్రం బెల్ట్‌ల‌ను, బైక్ కీస్‌ను అనుమ‌తించ‌లేదు. కాబ‌ట్టి గ్రూప్-4 ఎగ్జామ్‌కు కూడా వాటిని అనుమ‌తించ‌క‌పోవ‌చ్చు.

Latest News