BNశాస్త్రి పురస్కారం-2022కు గుంజి వెంక‌ట‌ర‌త్నం ఎంపిక

విధాత: ప్రముఖ చరిత్ర పరిశోధకులు దివంగత బి.ఎన్. శాస్త్రి పురస్కారం-2022ను డాక్టర్ గుంజి వెంకటరత్నంకు ప్రధానం చేయనున్నట్లు మూసీ సాహిత్య ధార నిర్వాహకులు గోపాలకృష్ణ మూర్తి తెలిపారు. పుర‌స్కారాన్ని వేద సంస్కృతి పరిషత్- మూసీ మాసపత్రిక సంయుక్తంగా అందిస్తార‌ని చెప్పారు. పురస్కార ప్రధాన వేడుకను హైదరాబాద్ ఎన్సీసీ ఉస్మానియా గేట్ సురభారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కార గ్రహీత గుంజి వెంకటరత్నంకు ప్రధానం చేయనున్నట్లుగా తెలిపారు. సభాధ్యక్షులుగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీరంగాచార్య, ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు […]

  • Publish Date - December 8, 2022 / 11:38 AM IST

విధాత: ప్రముఖ చరిత్ర పరిశోధకులు దివంగత బి.ఎన్. శాస్త్రి పురస్కారం-2022ను డాక్టర్ గుంజి వెంకటరత్నంకు ప్రధానం చేయనున్నట్లు మూసీ సాహిత్య ధార నిర్వాహకులు గోపాలకృష్ణ మూర్తి తెలిపారు.

పుర‌స్కారాన్ని వేద సంస్కృతి పరిషత్- మూసీ మాసపత్రిక సంయుక్తంగా అందిస్తార‌ని చెప్పారు.
పురస్కార ప్రధాన వేడుకను హైదరాబాద్ ఎన్సీసీ ఉస్మానియా గేట్ సురభారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కార గ్రహీత గుంజి వెంకటరత్నంకు ప్రధానం చేయనున్నట్లుగా తెలిపారు.

సభాధ్యక్షులుగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీరంగాచార్య, ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణచార్యులు, ప్రధాన వక్తగా ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజ మనోహర్ బాబు హాజరుకానున్నార‌ని తెలిపారు.