విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని అదృష్యమైంది. గత 4వ తేదీన హాస్టల్ నుండి అదృశ్య మైనట్లు పోలీస్ స్టేషన్ లో కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్స్వాడ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
విద్యార్థిని ఆచూకి లభించలేదని చెప్పారు. విద్యార్థిని తప్పిపోయి 12 రోజులు గడిచినప్పటికీ ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.