Site icon vidhaatha

Hyderabad | మైసమ్మగూడ.. వరదల్లో చిక్కుకున్న హాస్టల్స్

Hyderabad |

విధాత: మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో వరద ఉదృతికి అక్కడ ఆపార్ట్‌మెంట్‌లలో వరద నీరు భారీగా చేరడంతో అందులో నిర్వహిస్తున్న 15హాస్టల్స్‌కు సంబంధించిన విద్యార్థులు భవనాల్లోనే చిక్కుకు పోయారు. మైసమ్మగూడెంలోని పలు కాలనీలు, ఆపార్ట్‌మెంట్‌లు అన్ని జలమయమయ్యాయి.

స్థానికంగా ఉన్న నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇక్కడి అపార్ట్‌మెంట్‌లలోని హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఆయా అపార్ట్‌మెంట్ హాస్టల్స్ భవనాల్లో మొదటి అంతస్తు వరకు నీటి మట్టం చేరుకుంది. దీంతో హాస్టల్స్ భవనంలో చిక్కుకు పోయిన విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు.

చెరువు నీటి మార్గంలో అపార్ట్‌మెంట్లు నిర్మించినందునే వరద తాకిడికి గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సహాయక చర్యలలో భాగంగా విద్యార్థులను హాస్టల్స్ భవనాల నుంచి ఒక్కోక్కరుగా జేసీబీల సహాయంతో బయటకు తీసుకొస్తున్నారు

Exit mobile version