విధాత: మొత్తానికి పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ రచ్చ రచ్చ అయింది. వందల్లో కార్యకర్తల మీద కేసులు, అరెష్టులు.. పవన్ హోటల్లో స్వీయ నిర్బంధం.. సాయంత్రం విజయవాడ పయనంతో ఎపిసోడ్ ముగిసింది. ఆయనకు లెఫ్ట్ పార్టీలు..బీజేపీ, టీడీపీ రాజకీయంగా ఆయనకు మద్దతు పలకడం గమనార్హం.
జనసేన పార్టీ నేతలను కార్యకర్తలను జగన్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతోంది. పార్టీలకతీతంగా టీడీపీ బీజేపీ సీఐపీ లోక్‌సత్తా తదితర పార్టీలు సంఘాలు జగన్ ప్రభుత్వ దమన కాండను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.
ఎవరూ ఊహించని విధంగా ఆయనకు మాజీ హీరోయిన్ నికిషా పటేల్ మాత్రం మద్దతు పలికారు. పవన్ కల్యాణ్‌తో కొమరం పులి సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన నికిషా పటేల్ పవన్‌కు మద్దతు ప్రకటించారు. విశాఖను విడిచి పోవాలని తనకు పోలీసులు నోటీసులు జారీ చేశాక పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
“ఒక ఆలోచన నా మనస్సును దాటింది.. స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికి ఆర్కె బీచ్లో సాయంత్రం నడకకు వెళ్లడానికి నాకు అనుమతి ఉందా?” ఉందా అంటూ పవన్ కల్యాణ్ అక్టోబర్ 16 సాయంత్రం 5.30కు ఒక ట్వీట్ చేశారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి ఆర్కే బీచ్‌లో ఈవినింగ్ వాక్ చేయాలని ఉందని పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ నికిషా పటేల్ కూడా పవన్ కళ్యాణ్‌కు తన మద్దతు తెలియజేశారు. నేను మీతో నడుస్తాను అంటూ పవన్ ట్వీట్‌కు ఈ మాజీ హీరోయిన్ మద్దతు తెలిపారు.
చంద్రబాబు పరామర్శ!
జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ టూరు తీవ్ర ఉద్రికత్తలకు కారణమైన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలో విశాఖ గర్జన ముగించుకుని వస్తున్న వైసీపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.
మరోవైపు దీన్ని ఆ పార్టీ కుట్రగా పవన్ కల్యాణ్ చెబుతున్నారు. కోడి కత్తి తరహాలో వైసీపీ సానుభూతి కోసం డ్రామాలాడుతోందని మండి పడుతున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు కూడా పవన్‌కు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకుని తన మద్దతు తెలిపారు. జరిగిన పరిణామాలను పవన్.. చంద్రబాబుకు వివరించారు.
మరోవైపు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులు కూడా వైసీపీ ప్రభుత్వ చర్యలను జనసేన పార్టీ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించారు.