విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం ట్రాన్స్‌కో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కరెంట్ బిల్లులు అధికంగా రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కసారిగా విద్యుత్ బిల్లులు అధికంగా రావడంతో గ్రామానికి వచ్చిన ట్రాన్స్‌కో లైన్ ఇన్‌స్పెక్టర్ నగేష్, బిల్ కలెక్టర్, ఇతర సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
బిల్లులు చెల్లించమని తెగేసి చెప్పారు. అదనపు డిపాజిట్ పేర అదనంగా ఛార్జిల మోత మోగిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. పెంచిన ఛార్జిలను తగ్గించాలని డిమాండ్ చేశారు.