విధాత, అమరావతి: మాండూస్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. ఇవాళ మధ్యాహ్నం నుంచి స్కూళ్లు, కాలేజీలకు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
మధ్యాహ్న భోజనం అనంతరం సెలవులు ఇవ్వాలని.. ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను హెచ్చరించారు. అటు తుపాను ప్రభావంతో విశాఖ తీరంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. వైద్యులు, అధికారులు తమ తమ పరిధిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.