విధాత: హలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు డేవిడ్ లించ్ (78) (David Keith Lynch)కన్నుమూశారు. గత కొంతకాలంగా ఎపిసీమ (emphysema) అనే వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించి జనవరి 15 గురువారం రోజున తుదిశ్వాస విడిచారు. ఇటీవలే లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు నేపథ్యంలో తను ఉంటున్న ఇల్లు కాలీ చేసి కూతురు ఇంటికి వెళ్లిన ఇయన అక్కడే మరణించారు. ఈ వార్త తెలసిన వారంతా లెజండరీ నటుడి మరణానికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
1967లో ఎరేజర్ హెడ్ అనే సినిమాతో స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మాతగాను వ్యవహరిస్తూ కెరీర్ ప్రారంభించిన లించ్ 2006 వరకు 10 సినిమాలు చేశాడు. ఆ తర్వాత ఎక్కువగా షార్ట్ ఫిలింస్ పైన దృష్టి పెట్టిన ఆయన 2020 వరకు 50కి పైగా షార్ట్ ఫిలింస్ తెరకెక్కించాడు. ఇంకా సంగీత దర్శకుడిగా, మ్యూజిక్ వీడియోస్ కూడా పని చేశారు. ఇక నిజ జీవితంలో నలుగురిని పెళ్లాడిన లించ్ ముగ్గురికి విడాకులు ఇవ్వగా తన 78వ వయస్సులో చనిపోవడానికి నెల రోజుల ముందు నాలుగో భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉండడం గమనార్హం.
ఇదిలాఉండగా తన 8వ ఏటనే సిగరెట్ అలవాటు చేసుకున్న లించ్ విపరీతంగా సిగరేట్ తాగడం వళ్ల ఎపిసీమ వ్యాధికి గురై కాలీఫోర్నియా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల అక్కడ ఏర్పడ్డ కార్చిచ్చు వళ్ల అస్వస్థకు గురయ్యాడు ఈక్రమంలోనే ఆరోగ్యం క్షిణించి జనవరి 15 గురువారం రోజున చనిపోయాడు.