No Kiss | సిగ‌రెట్ మానేయ‌క‌పోతే నో కిస్.. త‌న భార్య‌కి ఆ హీరో భ‌లే కండీష‌న్స్ పెట్టాడుగా..!

No Kiss |  సీనియర్ నటి డిస్కో శాంతి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని, భర్త శ్రీహరితో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. భర్త మరణం తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగాను, తండ్రిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాంతి, ఈ సందర్భంగా శ్రీహరితో గడిపిన రోజులను జ్ఞాపకం చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

No Kiss |  సీనియర్ నటి డిస్కో శాంతి ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని, భర్త శ్రీహరితో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. భర్త మరణం తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగాను, తండ్రిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాంతి, ఈ సందర్భంగా శ్రీహరితో గడిపిన రోజులను జ్ఞాపకం చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.పెళ్లికి ముందు తాను ఛైన్ స్మోకర్ అని, పెళ్లైన తర్వాత శ్రీహరి కోసమే ఆ అలవాటును పూర్తిగా మానేసినట్లు ఆమె తెలిపింది. “పెళ్లి సమయంలో ఆయన ఒకటే చెప్పారు… ‘నువ్వు స్మోకింగ్ మానకపోతే నేను నీకు ముద్దు పెట్టను’ అని చెప్పారు.

శ్రీహ‌రి కోసం వెంటనే ఆ అలవాటు వదిలేశాను అని చెప్పుకొచ్చారు. అలాగే పెళ్లికి ముందు తన డ్రెస్ స్టైల్ చాలా మోడ్రన్‌గా ఉండేదని, చిన్న డ్రెస్సులతో ఎయిర్‌పోర్ట్‌లకు వెళ్లడం, పబ్లిక్‌లో కనిపించడం తనకు ఇష్టమని చెప్పారు. పెళ్లి తర్వాత శ్రీహరి సూచించిన విధంగా డ్రెస్ స్టైల్ మార్చుకోవడం కూడా తనకు సరైన నిర్ణయంలా అనిపించిందని తెలిపారు.సినిమాలు మానేయమని శ్రీహరి ఎప్పుడూ చెప్పలేదని, ఆ నిర్ణయం పూర్తిగా తనదేనని డిస్కో శాంతి స్పష్టం చేశారు. అనేక మంది మా పెళ్లి సమయంలో ఇద్దరికీ వేరువేరు రకాలుగా చెప్పి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు. “శ్రీహరి విలన్ పాత్రలు చేస్తాడు, రఫ్‌గా ఉంటాడు అని నన్ను ఆపారు. నన్ను ఐటెం సాంగ్ హీరోయిన్ అంటారని ఆయనను కూడా ఆపారు. కానీ మేమిద్దరం ఎవరి మాటలు పట్టించుకోలేదు” అని అన్నారు.

శ్రీహరి కెరీర్ మొదట్లో పెద్ద అవకాశాలు లేకపోయినా, తాను అప్పటికే స్టార్‌డమ్ ఉన్నప్పటికీ అతనితో జీవితం ప్రారంభించడానికి సిద్ధంగానే ఉన్నానని ఆమె వెల్లడించారు. “తినడానికి తిండి, వండడానికి ఓ ఇల్లు, మూడు పూటలు అన్నం, కాటన్ బట్టలు చాలు అన్నాను” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ‘420’ మూవీ షూటింగ్ సమయంలోనే శ్రీహరి పెళ్లి విషయాన్ని ప్రస్తావించాడని, తనకూ ఆయన అడిగిన తీరు నచ్చింద‌ని చెప్పారు. చివరకు గుడిలో అన్న కొడుక్కి గుండు చేయించడానికి వెళ్లినప్పుడు, అకస్మాత్తుగా “ఇప్పుడు తాళి కడతా” అని చెప్పి పెళ్లి చేసుకున్నారంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇక డిస్కో శాంతి దాదాపు 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది. ఇనాసి పాండియ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న నేచుర‌ల్ చిత్రం బుల్లెట్టు బండి లో ఆమె కీల‌క పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నుంది. డిస్కో శాంతి చెప్పిన ఈ వ్యక్తిగత విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News