విధాత, హైదరాబాద్ : రాజకీయాల్లో తన సొంత ఉనికిని చాటేందుకు బీఆర్ఎస్ బహిష్కృత మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులను రంగంలో దించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా తన సొంత గడ్డ నిజమాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతిని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయించాలని కవిత సిద్దమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ప్రకటనకు కవిత కసరత్తు చేపట్టారు. హైదరాబాద్ లోని కవిత నివాసంలో మున్సిపల్ ఎన్నికల ఆశావహులతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ లో 20 నుంచి 30 స్థానాల్లో జాగృతి అభ్యర్థులను పోటీ చేయించాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థులు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జాగృతి కార్యకర్తలు సింహం గుర్తును వైరల్ చేస్తున్నారు. సింహం గుర్తు కోసం కవిత ఎన్నికల సంఘం వద్ద అవసరమైన ప్రయత్నాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి :
DGP RamaChandra Rao : సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్
Harish Rao SIT inquiry| ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు
