Site icon vidhaatha

బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషికి అమెరికాలో చేదు అనుభవం

Huma Qureshi | బాలీవుడ్ బ్యూటీ నటి హ్యుమా ఖురేషికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ పని నిమిత్తం న్యూజెర్సీలోని నెవార్క్‌కి వెళ్లింది. సకాలంలో తన రెండు బ్యాగులు తేలేదంటూ ఎయిర్‌లైన్స్‌ కస్టమర్ సర్వీసులపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేస్తూ సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నేను నెవార్క్‌కి ఇప్పుడే వచ్చాను. కానీ, నా రెండు బ్యాగులు ఇంకా రాలేదు. సహాయం చేసేందుకు ఇక్కడ ఎవరూ లేరు. మీ ఆన్‌లైన్‌ నంబర్, వెబ్‌సైట్స్‌ పనికిరానివి. ఇక్కడ కస్టమర్ సర్వీస్ భయకరంగా ఉన్నాయి.

నా వస్తువులు నాకు ఎప్పుడూ అందుతాయో తెలియదు’ అంటూ ట్వీట్ చేసింది. హ్యుమా ట్వీట్‌పై యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. నటికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. బ్యాగులు అందడంలో ఆలస్యానికి చింతిస్తున్నామని పేర్కొంది.

బ్యాగేజ్ సర్వీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచిందింది. ఇదిలా ఉండగా.. హ్యుమా ఖురేషి నటించిన చిత్రం ‘మోనికా ఓ మై డార్లింగ్’ ఓటీటీలో విడుదలైంది. హ్యుమా నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

Exit mobile version