విధాత: ఇండస్ట్రీలో ఒక్కో ఫ్యామిలీకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఉదాహరణకు నందమూరి ఫ్యామిలీ తీసుకుంటే వారిది మాస్ ఫాలోయింగ్. ఇక మెగా కుటుంబానిది అదే రూటు. ఘట్టమనేని ఫ్యామిలి గురించి చెప్పాలంటే మహేష్ బాబు రాణింపుతో వారికి కూడా ఫ్యామిలీ ఇమేజ్ వచ్చింది. ఇక అక్కినేని ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని లేదు. వారి ఫ్యామిలీ రొమాంటిక్ హీరోలకు నిలయం. అలనాడు ఏఎన్ఆర్ పరిశ్రమను శాసించి తనదైన ట్రాజెడీ లవ్ చిత్రాలతో అమ్మాయిల హృదయాలను దోచుకున్నాడు.
ఆనాడు ప్రతి అమ్మాయి నాకు ఏఎన్ఆర్ వంటి అబ్బాయి కావాలని పట్టుబట్టేదట. లేడీస్‌లో ఆ రేంజ్ ఫాలోయింగ్ అక్కినేని నాగేశ్వరరావు సొంతం. ఆ తర్వాత పెళ్లయిన ఆంటీలు కూడా ఏఎన్ఆర్‌కు ఫాన్స్ గా ఉండేవారు. ఏఎన్ఆర్ తర్వాత ఆ ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి మారాజు శోభన్ బాబు. ఆయన్ని ఫ్యామిలీ హీరో అంటారు.
ఆ తర్వాత తరంలో జగపతిబాబుకు కాస్త ఆ ఇమేజ్ వచ్చింది. ఫ్యామిలీ హీరోగా ఆయన రాణించాడు. మాస్, యాక్షన్ ఇమేజ్ కంటే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతే ఎక్కువ. తాజాగా ఘట్టమనేని కృష్ణ చిన్న కుమారుడు మహేష్ బాబుకు అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరి మధ్యలో అసలుసిసలు మన్మధుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మాత్రం కింగ్ నాగార్జున అనే చెప్పాలి.
ఏఎన్ఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ రొమాంటిక్ చిత్రాలు చేస్తూ తనదైన స్టైల్ లో అందరినీ ఆకట్టుకున్నాడు. చివరకు ‘మన్మధుడు’ అనే చిత్రం చేసి అదే ‘మన్మధుడు’ అనే టైటిల్‌ను తన బిరుదుగా మార్చుకున్నాడు. కానీ కాస్త వయసు మీరింది కాబట్టి మన్మధుడు వదిలేసి కింగ్ దారి పట్టాడు. నాగార్జున నాడు అలనాటి శ్రీదేవితో కూడా ఖుదాగవా, ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా వంటి చిత్రాలు చేశాడు. ఆయనతో నటించడానికి ఏ హీరోయిన్ అయినా సుముఖంగా ఉండేది.
అప్పట్లో హీరోయిన్లను నీకు ఇష్టమైన హీరో తెలుగులో ఎవరు అంటే ఠక్కున నాగార్జున పేరు చెప్పేవారు. ఉదాహరణకు గౌతమి, టబూ, సుస్మితసేన్, ఐశ్వర్యరాయి, మనీషా కొయిరాలా… ఇలా ఎందరినో చెప్పుకోవచ్చు. ఎందుకనో తెలియదు కానీ వారందరూ నాగార్జునతో నటించడం ఎంతో కంఫర్ట్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. దాంతో ఆయన నిజంగా మన్మధుడేనేమో.. ఆయనకు లేడీస్ వీక్నెస్ కూడా ఉందేమో అని అనుమానాలు రావడం మొదలయ్యాయి.
నిజ జీవితంలో రెండు వివాహాలు చేసుకోవడం కూడా ఆ వార్తలకు బలం చేకూర్చింది. కానీ నాగార్జున మాత్రం తాను స్త్రీ పక్షపాతినే గాని స్త్రీ బలహీనత తనకు లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. అది కూడా బిగ్ బాస్ షోలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరూ వీక్షించే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఈ వయసులో ఆయనకు ఆ ఇమేజ్ అనేది కాస్త ఇబ్బందిగా మారిందని… అలాంటి పుకార్లకు ఇకనైనా ఫుల్ షాప్ పెట్టాలని ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నాడని అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే నాగార్జున కుమారులలో పెద్దవాడైన నాగచైతన్యకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. అనుకున్న ట్టుగానే సమంతని వివాహం చేసుకుని,విడాకులు కూడా ఇచ్చాడు. ప్రస్తుతానికి మరో వివాహం చేసు కోవడానికి రెడీ అంటున్నాడు. అఖిల్ కు కూడా మాస్ ఇమేజ్ బదులు రొమాంటిక్ ఇమేజ్ బాగుంటుందని నాగార్జున ఆలోచనగా చెప్తారు. నాగార్జున మేనల్లుడు సుమంత్ సైతం కీర్తి రెడ్డిని వివాహం చేసుకొని ఆ తర్వాత పలు వార్తల్లో నిలుస్తున్నాడు.
కాబట్టి నాగ్ ఒక్కడు క్లారిటీ ఇస్తే సరిపోదేమో.. ఆయన ఫ్యామిలీ మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఉందని జోక్స్ వినిపిస్తున్నాయి. కొసమెరుపు ఏమిటంటే ఎక్కువగా నాగార్జునకు టబుతో టచ్ ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ టబు ఎప్పుడు వచ్చినా తమ ఇంటిలోనే దిగుతుందని.. ఆమె తన కంటే అమలకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని షాకింగ్ కామెంట్లు చేశాడు. మొత్తానికి నాగ్ కూడా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌లా మంచి బాలుడిననే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడన్న మాట.