విధాత: సోషల్ మీడియా వినియోగం పెరిగాక సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా రీల్స్ చేస్తూ.. షేర్ చేస్తున్నారు. అంతేకాదు కచ్చా బాదం నుంచి పల్సర్ బైక్ పాటకు డ్యాన్స్ చేసిన ఝాన్సీ రోజుల వ్యవధిలో నే సోషల్ మీడియా స్టార్లుగా ఎదిగారు. టీవీల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం అంతలా ఉన్నది మరి.
కానీ ఈ మధ్య బిగ్ బాస్ ఫేం భానుశ్రీ పాడిన గెలుపు తలుపులే పాట.. నటుడు మోహన్ బాబు ఊరు వాళ్ళు పాడిన నేను జెడ వేస్తా .. అనే పాటలపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి చెప్పోచ్చు ఒక పాట గానీ, డ్యాన్స్ గానీ, సిగ్నిచర్ స్టెప్ గానీ బాగుంటే అవీ రీల్స్ అవుతున్నాయి. బాగా లేనివి ట్రోల్స్ అవుతున్నాయి.
అంతేకాదు మోహన్ బాబు ఫ్యామిలీ పై, టీవీ నటుడు ప్రభాకర్ కొడుకుపై వచ్చిన, వస్తున్న ట్రోల్స్ ఆపాలని పోలీసుల ఫిర్యాదు చేసి, ఆపండిరా బాబు అనే దాకా వెళ్లాయి. బాగుంటే రీల్స్.. లేకపోతే ట్రోల్స్ అనట్టు మారింది. సోషల్ మీడియాలో ప్రభావం ఎలా ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు