PM MODI |
- రూ.20లక్షల కోట్లు దోచుకున్నదొంగల ముఠా
- భోపాల్ సభలో ప్రధాని మోడీ
విధాత: సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోడీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు కూతురు బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. దేశం, దేశ ప్రజలందరూ బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ వేదికగా మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ రూ.20లక్షల కోట్లు దోచుకున్న దొంగల ముఠా అంటూ ఇటీవల సమావేశమైన పలు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ప్రధాని మోడీ పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా సీఎం కేసీఆర్, ఎంఎల్సీ కవిత పేర్లు ప్రస్తావించి మరీ ఎటాక్ చేశారు.
అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రాజీ కుదిరిందని, ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న మైత్రి బంధమే కారణమని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధనత్య సంతరించుకుంది.
మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించాలని అర్థం వచ్చేలా స్పష్టమైన వైఖరిని కనపరచడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మొదటిసారి కేసీఆర్‌పై మోదీ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారని చర్చించుకుంటున్నారు.
కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహించింది.
కేసీఆర్ బిడ్డకు మేలు కలగాలనుకుంటే బీఆర్‌ఎస్ కు ఓటేయండి…
గాంధీ కుటుంబానికి మేలు కలగాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండి…
లేదా మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి మేలు కలగాలనుకుంటే బిజెపికి ఓటేయండి…-’మేరా బూత్ సబ్సే మజ్బూత్‘లో ప్రధాని శ్రీ @narendramodi గారు. pic.twitter.com/fRBKrIAR3u
— BJP Telangana (@BJP4Telangana) June 27, 2023