చెలరేగిన ఓపెనర్లు.. తిరుగులేని భారత్‌

విధాత: మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకున్న భారత్‌ చివరి వన్డేలో నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేసి, ర్యాకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాలని టీమిండియా భావిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఇండోర్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకున్నది. దీంతో ఒపెనర్లుగా క్రీజులో అడుగు పెట్టిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఆద్యంతం సిక్స్‌లు, ఫోర్లతో ఇద్దరూ న్యూజిలాండ్‌ బౌలర్లను ఆటాడుకుని ఇద్దరూ […]

  • Publish Date - January 24, 2023 / 10:35 AM IST

విధాత: మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకున్న భారత్‌ చివరి వన్డేలో నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేసి, ర్యాకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాలని టీమిండియా భావిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఇండోర్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకున్నది.

దీంతో ఒపెనర్లుగా క్రీజులో అడుగు పెట్టిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఆద్యంతం సిక్స్‌లు, ఫోర్లతో ఇద్దరూ న్యూజిలాండ్‌ బౌలర్లను ఆటాడుకుని ఇద్దరూ సెంచరీలు బాదారు. సుదీర్ఘ కాలం తర్వాత రోహిత్‌ శర్మ 30వ సెంచరీతో ఆకట్టుకోగా.. శుభ్‌మన్‌ కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తూ 4వ సెంచరీ పూర్తి చేశారు.

101 పరుగుల వద్ద రోహిత్‌, 112 పరుగుల వద్ద శుభ్‌మన్‌ ఔటయ్యాడు. మొదటి వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడేళ్ల తర్వాత శతకం బాదిన రోహిత్‌ సెంచరీల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడుతున్న భారత్‌ ఇప్పటికే రెండింటిలో నెగ్గింది. ఈ మూడో వండేలోనూ గెలిచి సిరీస్‌ వైట్‌ వాష్‌ చేసే దిశగా భారత్‌ అడుగులు వేస్తున్నది.

36 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ 3 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది.