- 142.86 కోట్ల జనాభాతో భారత్ చైనాను అధిగమించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటన
- చైనా ప్రస్తుత జనాభా 147.57 కోట్లు అని వెల్లడి
విధాత: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏమిటి అంటే చైనా పేరు చెబుతాం. కానీ ఇప్పుడు ఆ సమాధానం మారింది. జనాభాలో భారత దేశం (India population) చైనాను దాటేసింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. భారత దేశ ప్రస్తుత జనాభా 142.86 కోట్లు కాగా.. చైనా జనాభా 142.57 కోట్లు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.