Bank Holidays : ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవు రోజులు ఇవే !

ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవులు ఇవే! 28 రోజుల్లో 6 రోజులు మూతపడనున్న బ్యాంకులు. బడ్జెట్ రోజైన ఫిబ్రవరి 1నే మొదటి సెలవు. తెలుగు రాష్ట్రాల పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.

Bank Holidays

విధాత : వార్షిక సంవత్సరంలో అతి చిన్నదైన 28రోజుల ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు వస్తే వినియోగదారులకు ఇబ్బందికమే. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో మొదలవుతున్న ఈ ఫిబ్రవరి మాసం ఆర్థిక సంవత్సరం మార్చి నెలకు ముందు చాల కీలకంగా కొనసాగుతుంది. చాల మంది తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు వెలుతుంటారు. అయితే 28 రోజుల ఫిబ్రవరి నెలలో ఆరు రోజులు సెలవులు రానుండగా..కొన్ని రాష్ట్రాలలో 7రోజుల సెలవులు వస్తుండటంతో బ్యాంకింగ్ వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది.

ఫిబ్రవరిలో 6 రోజులు బ్యాంకుల మూత

తెలుగు రాష్ట్రాలలో 6 రోజులు సెలవులు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1 ఆదివారం నేపథ్యంలో అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.తర్వాత వచ్చే ఫిబ్రవరి 8 ఆదివారం కూడా సాధారణ సెలవు, ఫిబ్రవరి 14 రెండో శనివారం, ఫ్రిబ్రవరి 15 ఆదివారం సెలవు దినాలుగా ఉన్నాయి.

లోసర్ పండుగ నేపథ్యంలో ఫిబ్రవరి 18న సిక్కిం రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 19న చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్బంగా ఆ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఫిబ్రవరి 22 ఆదివారం దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు, ఫిబ్రవరి 28న నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం కొనసాగనుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

SBI ATM Theft In Koti : పోలీసులకు సవాల్ గా మారిన కోఠి కాల్పుల కేసు
Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గాల్వాన్ అమరవీరుడి మాతృమూర్తి

Latest News