మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో మెరుగైన పురోగతి ఉంటుంది. వృత్తి పరమైన శుభవార్తలు ఉత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అధికారుల ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలతో లాభాలు గడిస్తారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్థానచలనం సూచనలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు పట్టుదలతో అధిగమిస్తారు. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. కుటుంబ శుభకార్యాల్లో సంతోషంగా పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు మంచి యోగదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆత్మీయుల సహకారంతో కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆచి తూచి అడుగేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గిస్తే మంచిది. కలహాలకు దూరంగా ఉండండి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు తెలివిగా నిర్వహించాలి. బంధువులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. మీ స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. పనిఒత్తిడి పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. అనవసరపు ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాలి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ధనధాన్య వృద్ధి ఉంటుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. కళాకారులకు, రచయితలకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మీ కీర్తి పెరుగుతుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి ఆచి తూచి అడుగేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి శుభప్రదమైన రోజు. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. ఆర్థికంగా ఒక సానుకూల సంకేతం ఉత్సాహాన్నిస్తుంది. అవివాహితులకు వివాహయోగం ఉంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి.
