Site icon vidhaatha

Indian Railway | జనరల్‌ టికెట్‌తో స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణం చేయవచ్చా..? చేస్తే ఎమవుతుందో తెలుసా..?

Indian Railway |

దేశంలో ఎక్కువ మంది వినియోగించే రవాణా వ్యవస్థ ఇండియన్‌ రైల్వే. నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లేవారంతా రైలుకే ప్రాధాన్యం ఇస్తుంటారు. తక్కువ చార్జీలతో పాటు అలసట లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోతుంటుంది. తమ ప్రయాణం కోసం ముందస్తుగానే టికెట్లను రిజర్వేషన్‌ చేసుకుంటూ ఉంటారు. ఇందు కోసం దాదాపు మూడు నెలల ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకునేందుకు రైల్వే సైతం అవకాశం కల్పిస్తుంది.

అలాగే అత్యవసర సమయాల్లోనూ ప్రయాణించే వారి కోసం తత్కాల్‌ టికెట్లను అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ తత్కాల్‌ టికెట్లు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది పోటీపడుతుండడంతో చాలా మందికి నిరాశే ఎదురవుతుంటుంది. ఎలాగైనా గమ్యస్థానాన్ని చేరుకునేందుకు చాలా మంది జనరల్‌ బోగీలను ఆశ్రయిస్తుంటారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో జనం ఉండడంతో మరికొందరు తమకు తోచిన రిజర్వేషన్‌ కోచ్‌లలో ఎక్కి ప్రయాణిస్తుంటారు.

SCR | రైలు ప్రయాణికులకు అలెర్ట్‌.. ఆ మార్గాల్లో వెళ్లే ట్రైన్స్‌ను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..!

వాస్తవానికి రైల్వేచట్టం 1989.. ప్రకారం ప్రయాణం 199 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ అయితే జనరల్‌ కంపార్ట్‌మెంట్ టికెట్ మూడు గంటలు చెల్లుబాటవుతుంది. దూరం ఎక్కువైతే వ్యాలిడిటీ 24 గంటలకు పెరుగుతుంది. ఆ మార్గంలో మరో మూడు గంటలపాటు ఎలాంటి రైలు అందుబాటులో లేకపోతే ఆ రైలులో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.

అయితే, రిజర్వేషన్ బోగీలోకి వచ్చిన తర్వాత టీటీఈకి మనం ఏ కారణంతో బోగీలోకి రావాల్సి వచ్చిందనే విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. స్లీపర్‌ క్లాస్‌లో ఏదైనా సీటు ఖాళీగా ఉంటే సరిపడా డబ్బులు తీసుకొని టికెట్‌ కేటాయిస్తారు.

IRCTC Char Dham Yatra | చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే మరి..!

ఖాళీ లేకపోతే తర్వాత వచ్చే స్టేషన్ వరకు టీటీఈ అనుమతించే అవకాశం ఉంది. తర్వాత బయటకు వెళ్లకపోతే రూ.250 జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించడానికి డబ్బులు లేకపోతే చలాన్ జారీ చేస్తారు. దాన్ని కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది.

టీటీఈ, పోలీసులు కానీ స్లీపర్ క్లాస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోను బయటకు వెళ్లమని చెప్పడం గానీ, మీ లగేజీని జప్తు కూడా చేయలేరు. కేవలం జరిమానా మాత్రమే విధిస్తారు. ఈ జరిమానాను చెల్లించడం ద్వారా స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం చేస్తారు.

IRCTC Rules | మీరు రైలులో ప్రయాణిస్తుంటారా..? నిబంధనలు మారాయి అవేంటో తెలుసుకోండి మరి..!

IRCTC Tirumala Package | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లానుకుంటున్నారా? రూ.4వేలకే బంపర్‌ ప్యాకేజీని తీసుకువచ్చిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC Kerala Tour | మండుటెండల్లో కేరళలో చల్లని టూర్‌..! బంపర్‌ ప్యాకేజీని తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ.. హైదరాబాద్‌ నుంచే..!

IRCTC Punya Khetra Yatra | పూరీ-కాశీ క్షేత్ర దర్శనాలకు వెళ్లాలనుకుంటున్నారా..? అద్భుతమైన ప్యాకేజీని తెచ్చిన ఐఆర్‌సీటీసీ.. హైదరాబాద్‌ నుంచే మొదలు..!

Exit mobile version