Site icon vidhaatha

Indi Go Flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. హైదరాబాద్‌ అత్యవసర ల్యాండింగ్‌..!

Indigo Flight | బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవరంగా ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి వారణాసి మధ్య నడిచే ఇండిగో ఎయిర్స్‌లైన్స్‌కు చెందిన 6E897 విమానంలో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 137 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం క్షేమంగా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సమాచారం ప్రకారం.. ఉదయం 6.15 గంటలకు విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. ఈ విషయాన్ని డీజీసీఏ ధ్రువీకరించింది. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం 6E897 శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని శంషాబాద్ వైపు మళ్లించినట్లు పేర్కొంది. సాంకేతిక లోపంపై విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ప్రయాణికులను తరలించేందుకు మరో విమానం ఏర్పాట్లు చేశారు.

Exit mobile version