NALGONDA: బుద్ధవనానికి అంతర్జాతీయ అవార్డు

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని బుద్ధ‌వ‌నం ప్రాజెక్టుకు అంతర్జాతీయ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర -2022 అవార్డు లభించింది. బౌద్ధ పర్యాటక అభివృద్ధికి, బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు స్ఫూర్తినిచ్చేలా బుద్ధ‌వనాన్నితీర్చిదిద్దినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. కోల్ కత్తలో జరుగుతున్న అంతర్జాతీయ బౌద్ధ పర్యటక నిర్వాహక మండలి సదస్సులో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు కొరియా ఇండియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చైర్మన్ బిక్షు దమ్ము దీప […]

  • Publish Date - December 10, 2022 / 11:02 AM IST

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని బుద్ధ‌వ‌నం ప్రాజెక్టుకు అంతర్జాతీయ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర -2022 అవార్డు లభించింది. బౌద్ధ పర్యాటక అభివృద్ధికి, బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు స్ఫూర్తినిచ్చేలా బుద్ధ‌వనాన్నితీర్చిదిద్దినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

కోల్ కత్తలో జరుగుతున్న అంతర్జాతీయ బౌద్ధ పర్యటక నిర్వాహక మండలి సదస్సులో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు కొరియా ఇండియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చైర్మన్ బిక్షు దమ్ము దీప పురస్కారాన్నిఅందించారు. సదస్సులో ఏర్పాటు చేసిన బుద్ధవనం స్టాల్ వివిధ దేశాల ప్రతినిధులను ఆకట్టుకోగా వారు బుద్ధవనం నిర్మాణం పట్ల అభినందనలు తెలిపినట్లు ఎక్స్పపర్ట్ కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.