IPL-2023 | ధనాదన్‌ లీగ్‌ షెడ్యూల్‌ ఇదే

గుజరాత్‌ - చెన్నై మధ్య మార్చి 31న తొలి మ్యాచ్‌ విధాత‌:- IPL-2023 | ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్‌ లీగ్‌లు ఉన్నా.. ఐపీఎల్‌ అంటే ఆ కిక్కే వేరు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా ? క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వేర్వేరు దేశాల క్రికెటర్లతో కలిసి భారత క్రికెటర్లు చేసే సందడి ప్రేక్షకులకు మంచి ఎంటర్​టైన్​మెంట్​ను అందిస్తున్నది. ధనాధన్​ షాట్లతో చెలరేగే బ్యాట్స్​మెన్​, యార్కర్లతో బ్యాటర్లపై విరుచుకుపడే బౌలర్ల ప్రదర్శనలు చూసేందుకు […]

  • Publish Date - February 18, 2023 / 07:52 AM IST
  • గుజరాత్‌ – చెన్నై మధ్య మార్చి 31న తొలి మ్యాచ్‌

విధాత‌:- IPL-2023 | ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్‌ లీగ్‌లు ఉన్నా.. ఐపీఎల్‌ అంటే ఆ కిక్కే వేరు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా ? క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వేర్వేరు దేశాల క్రికెటర్లతో కలిసి భారత క్రికెటర్లు చేసే సందడి ప్రేక్షకులకు మంచి ఎంటర్​టైన్​మెంట్​ను అందిస్తున్నది. ధనాధన్​ షాట్లతో చెలరేగే బ్యాట్స్​మెన్​, యార్కర్లతో బ్యాటర్లపై విరుచుకుపడే బౌలర్ల ప్రదర్శనలు చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు.

ఈ క్రమంలో క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మార్చి 31న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనున్నది. 52 రోజుల్లో 10 జట్ల మధ్య 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు రెండూ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి.

టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగునుండగా.. ఇందులో 18 డబుల్‌ హెడర్‌ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉన్నాయి. దేశంలోని 12 స్టేడియాల్లో ఆయా మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్ దశలో జట్లు సొంత మైదానంలో ఏడు, ప్రత్యర్థి జట్టు మైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2019 తర్వాత తొలిసారిగా అన్ని జట్లు తమ హోంగ్రౌండ్‌లో అభిమానుల మధ్య ఆడనున్నాయి.

కొవిడ్‌ కారణంగా 2020లో ఐపీఎల్‌ యూఏఈలో, ఆ తర్వాత 2021లో భారత్‌లోని కొన్ని మైదానాలకే పరిమితమైనా.. కరోనా మరోసారి ప్రతాపం చూపడంతో మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత మిగతా మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించారు. గత సీజన్‌లో భారత్‌లోనే టోర్నీ నిర్వహించినా.. లీగ్‌ మ్యాచ్‌లు ముంబయి, పుణేలో.. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌, కోల్‌కతా స్టేడియాల్లో నిర్వహించారు.