Site icon vidhaatha

జగన్ కౌంటర్ యాత్ర!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. జగన్ను నిలువరించేందుకు వచ్చే ఎన్నికల్లో జగన్ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ జనసేనలు తలో వైపు పాదయాత్ర, బస్సు యాత్రకు సిద్ధం అవుతుండగా ఇటు వారి యాత్రలు అడ్డుకునేందుకు ప్రభుత్వం రూల్స్.. నిబంధనలు, జీవో-1 వంటివి తెర మీదకు తెస్తూనే మరో వైపు కౌంటర్ ఎటాక్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది.

లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు, పవన్ చేపట్టబోయే వారాహి బస్సు యాత్రకు జవాబుగా జగన్ సైతం బస్సు యాత్రలకు ప్లాన్ చేసారని సమాచారం.

జగన్ ప్రతి జిల్లాను చుట్టేలా.. సంక్షేమ పథకాల లబ్ధిదారులను అందర్నీ కలిసేలా బస్సు యాత్రకు ప్లాన్ చేసారని తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు చెదిరి పోకుండా.. ఉండేలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్నికలకు ఆరు లేదా నాలుగు మాసాల ముందు గానే జగన్ సైతం ప్రజల్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

సంక్షేమ పథకాల అమలుతో పాటు.. ప్రతిపక్షాలే టార్గెట్గా ఆయన మరోసారి.. యాత్రకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. దీనికోసం జిల్లాకు ఓ ఇంచార్జి ని నియమించి పగడ్బందీగా యాత్రను చేపట్టి. విపక్షాలకు గట్టి సమాధానం చెబుతారని అంటున్నారు. జగన్ గానీ విస్తృతంగా జనంలోకి వెళితే మొత్తం రాజకీయ వాతావరణం.. సమీకరణాలు మారాయని వైసిపి ఆశిస్తోంది.

Exit mobile version