ఏపీ CSగా జ‌వ‌హ‌ర్ రెడ్డి.. ఉత్త‌ర్వులు జారీ

విధాత‌: ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ‌వ‌హ‌ర్ రెడ్డిని రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ మేర‌కు జీఏడీ ముఖ్య కార్య‌ద‌ర్శి ముత్యాల రాజు రేవు మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం సీఎస్ గా ఉన్న 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి స‌మీర్ శ‌ర్మ బుధ‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆయ‌న స్థానంలో జ‌వ‌హ‌ర్‌రెడ్డిని సీఎస్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం మ‌ధ్యాహ్నం బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. జ‌వ‌హ‌ర్‌రెడ్డి మొద‌టి నుంచి […]

  • Publish Date - November 29, 2022 / 11:30 AM IST

విధాత‌: ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ‌వ‌హ‌ర్ రెడ్డిని రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ మేర‌కు జీఏడీ ముఖ్య కార్య‌ద‌ర్శి ముత్యాల రాజు రేవు మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం సీఎస్ గా ఉన్న 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి స‌మీర్ శ‌ర్మ బుధ‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

ఆయ‌న స్థానంలో జ‌వ‌హ‌ర్‌రెడ్డిని సీఎస్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది. జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం మ‌ధ్యాహ్నం బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. జ‌వ‌హ‌ర్‌రెడ్డి మొద‌టి నుంచి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబానికి స‌న్నిహితంగా ఉన్నారు.

ఉమ్మ‌డి రాష్ట్రానికి వైఎస్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. వైఎస్ కుటుంబానికి స‌న్నిహితంగా ఉన్న జ‌వ‌హ‌ర్‌రెడ్డిని కావాల‌నే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ సీఎస్‌గా నియ‌మించార‌న్న చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.