కాజోల్ అంటే క్రష్ అంట.. లిప్‌లాక్ ఇచ్చేశాడు

విధాత: పెద్ద పెద్ద హీరోలకు కూడా కొందరు హీరోయిన్లు అంటే చాలా క్రష్. వారిని తనివి తీరా చూడాలని వీలుంటే ఓ ముద్దు ఇవ్వాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి ఘటనే ఇది. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ భార్య ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. బాజిగర్, కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే వంటి బ్లాక్ బస్టర్స్‌తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె నటించిన ‘మెరుపు కలలు’ చిత్రం తెలుగులోనూ […]

  • Publish Date - January 21, 2023 / 03:23 AM IST

విధాత: పెద్ద పెద్ద హీరోలకు కూడా కొందరు హీరోయిన్లు అంటే చాలా క్రష్. వారిని తనివి తీరా చూడాలని వీలుంటే ఓ ముద్దు ఇవ్వాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి ఘటనే ఇది. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ భార్య ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్.

బాజిగర్, కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే వంటి బ్లాక్ బస్టర్స్‌తో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె నటించిన ‘మెరుపు కలలు’ చిత్రం తెలుగులోనూ డ‌బ్ అయింది. ఇందులో ప్రభుదేవా, అరవింద్ స్వామి నటించారు. ఆ తరువాత ధనుష్ హీరోగా తెరకెక్కిన రఘువరన్ బీటెక్ 2 చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా తెలుగులో విడుదలైంది.

అజయ్‌తో పెళ్లి తర్వాత కాజోల్ సినిమాలు చేయడం తగ్గించేసింది. మళ్లీ చాలా సంవత్సరాల తరువాత నటి కాజోల్ 2022లో త్రిభంగ చిత్రంతో డిజిటల్ రంగప్రవేశం చేసింది. ఆ వెంటనే ది గుడ్ వైఫ్ హిందీ రీమేక్‌కి అంగీకారం తెలిపింది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కాజోల్‌కి జోడీగా నటించిన బ్రిటిష్- పాకిస్తానీ నటుడు అలీ ఖాన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాజోల్‌తో రొమాంటిక్ సీన్స్ చేశానని రివీల్ చేశాడు.

ఆయన మాట్లాడుతూ కాజోల్ నా అభిమాన హీరోయిన్. ఆమెతో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ అద్భుతం. కాజోల్ అంటే నాకు క్రష్. గత మూడు దశాబ్దాలుగా నేను ఆమెకు వీరాభిమానిని. ఇన్నేళ్లకు ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చింది. అది కూడా ఓ రొమాంటిక్ సీన్‌లో. నా చిన్ననాటి క్ర‌ష్‌కి ఫ్రెంచ్ కిస్ పెట్టాలి. అది కూడా కాజోలు భర్త అజయ్ దేవగన్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్. ముంబైలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఈ కిస్ సీను షూట్ చేశారు.

ఆరోజు అజయ్ షూటింగ్‌కి రాలేదు. ఆ హోటల్లో ఆ కిస్సింగ్ సీన్‌ని రెండు సెకండ్స్‌లో పూర్తి చేశాం. అంతకుముందు రెండు మూడు సార్లు ప్రాక్టీస్ కూడా చేశాం. షాట్ ఒకే టేక్‌లో పూర్తయింది. కాజోల్ థాంక్యూ డార్లింగ్ అని మెచ్చుకుంది.. అంటూ ముంబై హోటల్ గదిలో జరిగిన ముద్దు సన్నివేశం చిత్రీకరణ విశేషాలు చెప్పాడు పాకిస్తానీ నటుడు అలీ ఖాన్.