వామ్మో.. పిల్లి గర్జన: ఎమ్మెల్యే కంచర్లకు ధీటుగా.. భారీ కాన్వాయ్‌తో ఖమ్మంకు !

విధాత, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పోటీ పడుతున్న బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లి స్థానికంగా మరోసారి హల్ చల్ చేశారు. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పిల్లి రామరాజు నియోజకవర్గంలో బల ప్రదర్శన అన్నట్లుగా బుధవారం పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లతో కూడిన కాన్వాయ్‌తో ఖమ్మం బయలుదేరారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ […]

  • Publish Date - January 18, 2023 / 05:42 PM IST

విధాత, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పోటీ పడుతున్న బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీ కాన్వాయ్‌తో తరలివెళ్లి స్థానికంగా మరోసారి హల్ చల్ చేశారు.

నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పిల్లి రామరాజు నియోజకవర్గంలో బల ప్రదర్శన అన్నట్లుగా బుధవారం పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లతో కూడిన కాన్వాయ్‌తో ఖమ్మం బయలుదేరారు.

స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ధీటుగా రామరాజు వర్గం పట్టణంలో గులాబీ కేడర్ కాన్వాయ్ ర్యాలీతో చేసిన హంగామా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

భూపాల్ రెడ్డి వర్గీయుల ఖమ్మం వాహనాల కాన్వాయ్ ఎన్జీ కళాశాల నుంచి బయలుదేరగా.. దానికి పోటీ అనిపించేలా పిల్లి కూడా తన వర్గీయుల కాన్వాయ్‌తో ఖమ్మం పయనమయ్యారు.

మొత్తంగా భూపాల్ రెడ్డికి పోటీగా నియోజకవర్గంలో తగ్గేదేలే అంటూ పిల్లి రామరాజు నిర్వహిస్తున్న పోటాపోటీ కార్యక్రమాలు సెగ్మెంట్లో గులాబీ పార్టీ ఇంటిపోరుకు మరింత ఆజ్యం పోస్తున్నాయని పార్టీ వర్గాలలో బహిరంగ చర్చ సాగుతుంది.