Site icon vidhaatha

Karimnagar | స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు.. 8 గంటలకు పైగా విచారణ

Karimnagar

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ తాళాలు మాయమైన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 6 గంటలుగా విచారణ జరుపుతున్నారు. ఉదయం 12 గంటలకు మొదలైన విచారణ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. రాత్రి 8గంటల వరకు విచారణ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు.

విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముగ్గురు సభ్యుల బృందం కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని జేఎన్టీయూ కళాశాలకు చేరుకుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ రవికిరణ్ స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై విచారణ కొనసాగిస్తున్నారు.

కస్టోడియన్ అధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల వద్ద ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎలా మాయమయ్యాయంటూ అధికారులను ప్రశ్నించారు. ధర్మపురి ఎన్నికల సందర్భంగా పనిచేసిన కలెక్టర్ శరత్, ఆ తర్వాత పనిచేసిన కలెక్టర్ రవినాయక్‌తో పాటు.. ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషా విచారణకు హాజరయ్యారు.

కలెక్టర్లతో పాటు నాటి ఎన్నికల అధికారులు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నించారు. అధికారులు సమయం ఇవ్వకపోవడంతో
ఆయన తిరిగి వెళ్ళిపోయారు.

Exit mobile version