Karnataka CM | కర్ణాటక సీఎంగా నేడు సిద్ధరామయ్య ప్రమాణం.. పలు రాష్ట్రాల సీఎంలు, నేతలకు ఆహ్వానం

Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనున్నది. మంత్రివర్గ కూర్పుపై హైకమాండ్‌తో చర్చించేందుకు సిద్ధరామయ్య శివకుమార్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. మంత్రివర్గ కూర్పు సిద్ధరామయ్యకు తలనొప్పిగానే మారింది. అతికష్టం మీద డెప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు సిద్ధమయ్యారు డీకే శివకుమార్‌. కానీ, దళిత నేత […]

  • Publish Date - May 20, 2023 / 01:13 AM IST

Karnataka CM |

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనున్నది.

మంత్రివర్గ కూర్పుపై హైకమాండ్‌తో చర్చించేందుకు సిద్ధరామయ్య శివకుమార్‌తో కలిసి శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. మంత్రివర్గ కూర్పు సిద్ధరామయ్యకు తలనొప్పిగానే మారింది. అతికష్టం మీద డెప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు సిద్ధమయ్యారు డీకే శివకుమార్‌. కానీ, దళిత నేత పరమేశ్వర మాత్రం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులు చేయాలని డిమాండ్‌ పరమేశ్వర లేవనెత్తారని.. అయితే దాన్ని పార్టీ హైకమాండ్‌ పట్టించుకోకుండా డీకే శివకుమార్‌కు మాత్రమే డీప్యూటీ సీఎం చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. కొత్త, పాత తరాలకు చెందిన నేతల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ప్రణాళిక చేస్తున్నది.

లెక్కల ప్రకారం 34 మందికి చోటు కల్పించనుండగా.. ఆశావహులు చాలా మందే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో త్యాగాలు చేయాల్సి వస్తుందని సీనియర్‌ నేత పరమేశ్వర పేర్కొన్నారు. మరో వైపు లింగాయత్‌ నేత ఎంబీ పాటిల్‌ సైతం తనను ఉప ముఖ్యమంత్రిని చేయనందుకు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎవరు ఓటు వేసినా అన్ని వర్గాలకు కేబినెట్‌లో చోటు కల్పించాలన్నారు.

విపక్ష నేతలకు ఆహ్వానం..

సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీల పలు రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలను కార్యక్రమానికి ఆహ్వానించింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే ఉన్నారు. అయితే, మమత బెనర్జీ వేడుకకు హాజరుకావడం లేదని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ పేర్కొన్నారు.

Latest News