బీజేపీతోనే కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన అంతం: రాజగోపాల్ రెడ్డి

బీజేపీ గెలుపుతోనే మైసయ్యకు నిజమైన నివాళి విధాత: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని అవినీతి కుటుంబ పాలన అంతమొందించడం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో దివంగత బీజేపీ నేత గుండగోని మైసయ్య గౌడ్ వర్ధంతి సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉనికి కోసం ప్రజల్లో తిరిగే మైసయ్య గౌడ్, చాడా శ్రీధర్ రెడ్డి, కంచనపల్లి […]

  • Publish Date - March 27, 2023 / 12:41 AM IST

  • బీజేపీ గెలుపుతోనే మైసయ్యకు నిజమైన నివాళి

విధాత: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని అవినీతి కుటుంబ పాలన అంతమొందించడం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో దివంగత బీజేపీ నేత గుండగోని మైసయ్య గౌడ్ వర్ధంతి సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉనికి కోసం ప్రజల్లో తిరిగే మైసయ్య గౌడ్, చాడా శ్రీధర్ రెడ్డి, కంచనపల్లి రవీందర్ రెడ్డి వంటి జిల్లా బీజేపీ నాయకులను మావోయిస్టులు బలిగొన్నారన్నారు. నేడు మావోయిస్టులే దేశం నుంచి కనుమరుగై పోయారన్నారు.

అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కమ్యూనిస్టులకు సైతం జనం ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. కాలం మారిందని ముగ్గురు ఎంపీలు ఉన్న బీజేపీ నేడు దేశాన్ని పాలిస్తుందని, 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉందన్నారు. ప్రపంచంలోనే నేడు అతిపెద్ద పార్టీగా బీజేపీ కొనసాగుతుందన్నారు.

తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు శిష్యుడైన ఓటుకు నోటు దొంగ రేవంత్‌కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారధ్యం సిగ్గుచేటు అన్నారు. రేవంత్ వంటి దొంగ నాయకులను తెలంగాణ ప్రజలను నమ్మడం లేదన్నారు.

ప్రపంచంలో దేశ ఖ్యాతిని పెంచి, అవినీతి రహిత పాలన అందిస్తున్న ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సైతం రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించే దిశగా ఆలోచన చేస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు అంకితభావంతో పనిచేసి జిల్లాలో 12 సీట్లను గెలవడం ద్వారా గుండగోని మైసయ్యకు ఘన నివాళులర్పించేందుకు పాటు పడాలన్నారు.

దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీలలో బీజేపీని ప్రజలు గెలిపించి రాష్ట్రంలో బీజేపీని ఆదరించారని అన్నారు. మునుగోడులో పార్టీ లేకున్నా 87 వేల ఓట్లు బీజేపీకి వచ్చాయంటే ప్రజలు బీజేపీకి ఇస్తున్న మద్దతుకు నిదర్శనం అన్నారు. సీఎం కేసీఆర్ కౌరవ సైన్యానికి ఎదురొడ్డి ప్రజలు బీజేపీని నైతికంగా గెలిపించారన్నారు.

ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటుందన్నారు. అవినీతి కేసీఆర్ కుటుంబం మొత్తం జైలు పాలయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఉద్యోగులు సైతం సీఎం కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్నారని, మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ రాష్ట్రం నేడు జీతాల కోసం ప్రభుత్వ భూములను అమ్మాల్సిన దుస్థితికి చేరిందన్నారు.

ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, ధరణి కాలేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయించారని, దిక్కులేని పరిస్థితి నెలకొందని ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి బీజేపీ మాత్రమే దిక్కని ఉద్యోగులు చెబుతున్నారన్నారు.

లిక్కర్ స్కాంలో కవిత, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో కేటీఆర్ పాత్ర ఉందని, కవిత వచ్చే బతుకమ్మ పండుగ నాటికి జైలుకు పోక తప్పదన్నారు. తండ్రి కేసీఆర్ను అడ్డం పెట్టుకొని కేటీఆర్ తన స్థాయి మరిచి ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూ ప్రజల్లో మరింత పలచనవుతున్నదని అన్నారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరు జైలుకెళ్లక తప్పదన్నారు.

టిఎస్పిఎస్సి పేపర్ల లీకేజీలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే అసలు దోషులు బయటపడతారన్నారు. రాహుల్ గాంధీ పై కోర్టు తీర్పు మేరకే చట్టపరంగా అనర్హత వేటు పడిందని, దానికి బిజెపిని ప్రధాని మోడీని నిందిస్తూ ప్రజల్లో సానుభూతి కోసం మూల పడిన కాంగ్రెస్ మళ్ళీ రోడ్లమీదకి వస్తుందన్నారు. అయినా కాంగ్రెస్ ను దేశంలో రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు గుండగొని భరత్, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, పి. శ్యాంసుందర్, దాసరి మల్లేశం, మాధగోని శ్రీనివాస్ గౌడ్ నాగం వర్షిత్ రెడ్డి బండారు ప్రసాద్, తీరం దాస్ కనకయ్య, ఫకీర్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Latest News