Site icon vidhaatha

Arvind | కేసీఆర్ గజ్వేల్ ప్రజలను అవమానించినట్లే: ఎంపీ ధర్మపురి అరవింద్

Arvind |

విధాత ప్రతినిధి, నిజామాబాద్: ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, ఈనిర్ణయం గజ్వేల్ ప్రజలను అవమానించినట్లు కాదా? అక్కడి ప్రజలపై నమ్మకం లేనట్లేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో అరవింద్ మీడియాతో మాట్లాడారు.

ఈటెల రాజేందర్ గతంలో గజ్వేల్ నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతోనే, దడ పుట్టి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో నిజామాబాద్ పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజకీయంగా ఓటమి, అభద్రతా భావం ఎంతగా ఉందో కల్వకుంట కుటుంబంలో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఇంత అభద్రతా భావం ఉంటే, ఇక వేరే సిటింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉండబోతుందో అని అన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతా సిటింగ్ లకే ఇచ్చారని, అభ్యర్థుల ప్రకటన బట్టి బీజేపీ గెలుపునకు బలం చేకూరిందని అన్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి, నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ పెట్టుకుని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే గజ్వేల్ ప్రజలను కేసీఆర్ అవమానించినట్లు, వారిపై నమ్మకం లేనట్లే అన్నారు.

Exit mobile version