Site icon vidhaatha

Keerthy Suresh | బాలీవుడ్‌లోకి ‘మహానటి’ ఎంట్రీ..! భారీగానే రెమ్యునరేషన్‌ పెంచేసిన కీర్తి సురేశ్‌..!

Keerthy Suresh | కీర్తి సురేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా తెరంగేట్రం చేసిన కీర్తి.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో పూర్తి చేసి.. తిరిగి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో వచ్చిన మలయాళం చిత్రం ‘గీతాంజలి’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. మొదట గ్లామరస్‌ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ఆస్కారమున్న సినిమాలు చేస్తున్నది. ‘మహానటి’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్నది.

లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు, డీ గ్లామర్ రోల్స్ చేస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నది. మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో కాస్త గ్లామర్ డోస్​ పెంచి మెస్మరైజ్ చేసేందుకు ప్రయత్నించింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నది. కీర్తి చివరిసారిగా తెలుగులో మెగాస్టార్ నటించిన ‘భోళాశంకర్‌’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నది. ఇప్పటి వరకు కేవలం దక్షిణాది చిత్రాలకు పరిమితమైన కీర్తి బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నది.

ఈ చిత్రానికి కలీస్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం 31న థియేటర్లలోకి విడుదలకానున్నది. అయితే, కీర్తి సురేశ్‌ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్‌ తీసుకోనున్నట్లు టాక్‌. బేబీ జాన్‌ సినిమా కోసం ఏకంగా కీర్తి రూ.4కోట్లు ఫీజు తీసుకుంటున్నట్లు టాక్‌. అయితే, టాలీవుడ్‌లో ఒక్కో చిత్రానికి రూ.2కోట్ల వరకు పారితోషకం తీసుకునేది.. బాలీవుడ్‌లోకి వెళ్లగానే రెమ్యునరేషన్‌ను డబుల్‌ చేసినట్లు టాక్‌. ఇదిలా ఉండగా.. కీర్తి సురేశ్‌ చివరిసారిగా సైరన్‌ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం రఘుతాత, రివాల్వర్‌ రీటా, కన్నివెడి చిత్రాలతో నటిస్తున్నది.

Exit mobile version