Theatre Movies | ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి… యాక్షన్ నుంచి హారర్ వరకూ విభిన్న జానర్లలో రిలీజ్‌లు

Theatre Movies | ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, హారర్, థ్రిల్లర్, డ్రామా వంటి విభిన్న జానర్లలో సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో థియేటర్లలో సందడి మరింత పెరగనుంది. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి భారీ యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలు, బాలీవుడ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ విడుదలవుతుండటం సినీప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Theatre Movies | ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, హారర్, థ్రిల్లర్, డ్రామా వంటి విభిన్న జానర్లలో సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో థియేటర్లలో సందడి మరింత పెరగనుంది. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి భారీ యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలు, బాలీవుడ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ విడుదలవుతుండటం సినీప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతదేశవ్యాప్తంగా జనవరి 30న ఎక్కువ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. తెలుగులో ఈ వారం ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వాటిలో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాపై మాత్రం అంచనాలు ఉన్నాయి. మిగతా చిత్రాలు చిన్న బడ్జెట్‌తో, కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

హిందీ సినిమాల విషయానికి వస్తే రాణీ ముఖర్జీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ ‘మర్దానీ 3’ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ట్రైలర్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో ఎలా రిసీవ్ అవుతుందో చూడాలి. అలాగే హాలీవుడ్ నుంచి యాక్షన్ స్టార్ జేసన్ స్టాథమ్ నటించిన థ్రిల్లర్ ‘షెల్టర్’, సర్వైవల్ థ్రిల్లర్ ‘సెండ్ హెల్ప్’ కూడా విడుదలవుతుండటంతో యాక్షన్, థ్రిల్లర్ అభిమానులకు ఈ వారం పండుగే అని చెప్పాలి. మలయాళం నుంచి ‘ప్రకంబనం’, ‘వలతు వసతే కల్లన్’ అనే సినిమాలు విడుదలవుతుండగా, మరాఠీ భాషలో ‘పున్హా ఏక్దా సాడే మాడే తీన్’, ‘రణపతి శివ్రాయ్ – స్వారీ ఆగ్రా’ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. బెంగాలీ భాషలో ‘ప్రత్యబర్తన్: ది హోంకమింగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒడియా నుంచి మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ‘పరీ: అన అన్‌సాల్వ్డ్ మిస్టరీ’ కూడా ఈ వారం విడుదలకు సిద్ధమైంది.

కన్నడ చిత్రసీమ నుంచి ఈసారి భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘బోస్’, ‘మవుట’, ‘వికల్ప’, ‘సీట్ ఎడ్జ్’, ‘వలవారా’, ‘చౌకిదార్’, ‘అమృతాంజన్’, ‘రక్త కాశ్మీర’, ‘శ్రీ జగన్నాథ దాసరు: పార్ట్ 2’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగులో ఈ వారం పలు చిన్న, మధ్య స్థాయి సినిమాలు విడుదలవుతున్నాయి. ‘వన్/4’, ‘జమానా’, ‘త్రిముఖ’, ‘దేవగుడి’, ‘జగన్నాథ్’, ‘ప్రేమ కడలి’, ‘ధృతరాష్ట్రుడు’, ‘ఓం శాంతి శాంతి శాంతిహిః’ సినిమాలతో పాటు మలయాళంలో రూపొందిన ‘చతా పచా: ది రింగ్ ఆఫ్ రౌడీస్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా థియేటర్లలోకి రానుంది.

తమిళ ప్రేక్షకుల కోసం ‘గ్రానీ’, ‘మెల్లిసై’, ‘లాక్‌డౌన్’ చిత్రాలు రిలీజ్ అవుతుండగా, హాలీవుడ్ నుంచి ‘షెల్టర్’, ‘సెండ్ హెల్ప్’ అనే థ్రిల్లర్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గుజరాతీ భాషలో ‘పాట్కీ’, ‘చౌరంగి’, ‘మాలుమాడి’ చిత్రాలు రాబోతున్నాయి.ఇక హిందీలో ‘గాంధీ టాక్స్’, ‘హ్యూమన్ కోకైన్’, రాణీ ముఖర్జీ నటించిన ‘మర్దానీ 3’ జనవరి 30న విడుదల కానుండగా, మరో ఆసక్తికర చిత్రం ‘మాయాసభ – ది హాల్ ఆఫ్ ఇల్యూషన్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా ఈ వారం అన్ని భాషల్లోనూ విభిన్న జానర్ల సినిమాలు విడుదలవుతుండటంతో, థియేటర్లలో సందడి తప్పకపోవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News