LPG Booking Complaints | గ్యాస్ సిలిండర్ అందలేదా ?..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!

పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్యల పరిష్కరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికి డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఫోన్ నెంబర్లను విడుదల చేశాయి.

LPG Gas

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్యల పరిష్కరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఎల్పీజీ కొరత లేదంటూ ప్రభుత్వాలు ప్రకటించినప్పటికి..వినియోగదారులు మాత్రం ఆందోళనతో గ్యాస్ బుకింగ్ చేసేస్తూ సిలిండర్ల కోసం ఎదురుచూపులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలకమైన సూచనలు చేసింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికి డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఫోన్ నెంబర్లను విడుదల చేశాయి. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ డెలివరీ ఆలస్యం అయితే..ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 7718955555 కు ఫోన్ చేయాలని తెలిపారు. భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 7715012345 కు, HP గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 9493602222 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని LPG కంపెనీలు సూచించాయి.

ఇవి కూడా చదవండి :

LPG Gas | వంట గ్యాస్ కోసం క్యూలైన్‌లో.. గుండెపోటుతో కుప్ప‌కూలిన వృద్ధుడు
గ్యాస్ కొరత పరిష్కరానికి మానిటరింగ్ కమిటీలు : మంత్రి ఉత్తమ్

Latest News