Tapsee Pannu | అంద‌రి ముందు ప్యాడెడ్ బ్రాలు వేసుకోమ‌ని చెప్పేవారు.. సౌత్ ఇండ‌స్ట్రీపై తాప్సీ సంచ‌ల‌న కామెంట్స్

Tapsee Pannu | టాలీవుడ్‌లో ఝమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి తాప్సీ పన్ను Taapsee Pannu ఆ తర్వాత వరుస చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

Tapsee Pannu | టాలీవుడ్‌లో ఝమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి తాప్సీ పన్ను Taapsee Pannu ఆ తర్వాత వరుస చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌భాస్‌తో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్, ర‌వితేజ‌తో వీర‌, గోపిచంద్‌తో సాహ‌సం వంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆనందో బ్ర‌హ్మా, గుండెల్లో గోదారి చిత్రాలు కూడా ఆమె కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాయి.

తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ వైపు అడుగులు వేసిన తాప్సీ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోర్ట్‌రూమ్ డ్రామా Aisi (అస్సీ) మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అనుభ‌వ్ సిన్హా దర్శకత్వం వహించగా, క‌ని కుసృతి కీలక పాత్రలో నటించారు.

సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ వ్యాఖ్యలు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. గ్లామర్ సన్నివేశాలు, పాటల చిత్రీకరణ సమయంలో మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని సూచించేవారని చెప్పారు. షూటింగ్ సెట్లో అందరి ముందూ అలాంటి విషయాలు చెప్పడం మహిళగా తనకు అసౌకర్యంగా అనిపించేదని వెల్లడించారు.

అలాగే సౌత్ మరియు భోజ్‌పురి చిత్రాల్లో పాటల సమయంలో హీరోయిన్ల నాభిపై అధికంగా ఫోకస్ పెడతారని పేర్కొన్నారు. హిందీ చిత్రాల్లోని ఐటెమ్ సాంగ్స్‌లో అలాంటి దృశ్యాలు ఉంటాయని అంగీకరించినా, సౌత్ చిత్రాల్లో ఉన్నంతగా ఉండవని అభిప్రాయపడ్డారు.

గతంలోనూ సౌత్ సినిమాల్లో నటించడం వల్ల తనకు సరైన గుర్తింపు రాలేదని తాప్సీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్‌గా కొనసాగినా, సంతృప్తినిచ్చే పాత్రలు దక్కలేదని ఆమె అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌లో ఆమె చివరిసారిగా మిష‌న్ ఇంపాజిబుల్‌ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం తాప్సీ భార‌త్ భాగ్య విధాత అనే రాజకీయ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఆమె తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News