Rashmika | రష్మికను సరదాగా ఆటపట్టించిన షాహిద్ కపూర్.. వైరల్ అవుతున్న స్టార్ జంట కెమిస్ట్రీ!

Rashmika | దక్షిణాది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక, తాజాగా ముంబైలో నిర్వహించిన ‘కాక్‌టెయిల్ 2’ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ కృతి సనన్ కూడా హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై వీరి సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Reported by: Sandeep | సినిమా | May 30, 2026, 4:02 pm IST
Read Time: 5 mins
Rashmika | రష్మికను సరదాగా ఆటపట్టించిన షాహిద్ కపూర్.. వైరల్ అవుతున్న స్టార్ జంట కెమిస్ట్రీ!

Rashmika | దక్షిణాది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక, తాజాగా ముంబైలో నిర్వహించిన ‘కాక్‌టెయిల్ 2’ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ కృతి సనన్ కూడా హాజరయ్యారు. రెడ్ కార్పెట్‌పై వీరి సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా షాహిద్ కపూర్, రష్మిక మందన్న కలిసి ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఫోటోషూట్ జరుగుతున్న సమయంలో రష్మిక ఒక్కసారిగా షాహిద్ వైపు తిరిగి ఆశ్చర్యపోతున్నట్లు, ఎమోషనల్‌గా స్పందిస్తున్నట్లు సరదాగా హావభావాలు ప్రదర్శించింది. దీనిని గమనించిన షాహిద్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

అయితే ఈ సరదా మూమెంట్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. గతంలో ఓ మీడియా సమావేశంలో షాహిద్ అనుకోకుండా రష్మిక భుజంపై చేయి వేయగా, ఆమె సరదాగా భుజాన్ని కదిలిస్తూ స్పందించింది. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఆ సంఘటనను షాహిద్ తరచూ సరదాగా గుర్తుచేస్తూ రష్మికను ఆటపట్టిస్తుంటాడు.జాగా కూడా అదే తరహాలో రష్మికను అనుకరిస్తూ షాహిద్ కొన్ని ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన షాహిద్ కపూర్, “నువ్వు నన్ను చూసి అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు రష్మిక.. నేను నిజంగానే నీ పక్కన ఉన్నాను!” అంటూ చమత్కారంగా కామెంట్ చేశాడు.

షాహిద్ పోస్ట్‌కు రష్మిక కూడా అంతే సరదాగా స్పందించింది. ఆ స్టోరీని రీషేర్ చేస్తూ, తామిద్దరం కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి సరదా క్షణాలు ఎన్నో జరుగుతుంటాయని తెలిపింది. షాహిద్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంటుందని, సెట్స్‌లో ఆయన ఎనర్జీ ప్రత్యేకంగా ఉంటుందని ప్రశంసించింది.ఇటీవల వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించకపోయినా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.

ముంబై ఈవెంట్‌లో షాహిద్-రష్మిక మధ్య కనిపించిన ఈ సహజమైన స్నేహం, సరదా కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు చూస్తే, వీరి ఆఫ్-స్క్రీన్ బాండింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారని చెప్పాలి. ఇదే కెమిస్ట్రీ వెండితెరపై కూడా కనిపిస్తే, ఈ జంట మరో సూపర్ హిట్ కాంబినేషన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)