Anushka Shetty | సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితంపై తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆమె అఫైర్, పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా అనేక రూమర్లు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అయితే తనపై వచ్చే గాసిప్‌లకు అనుష్క ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. తన మౌనంతోనే అలాంటి వార్తలకు సమాధానం ఇచ్చినట్లు కనిపించింది.తాజాగా అనుష్క శెట్టి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతకాలంగా సినిమాలకు, మీడియాకు కొంత దూరంగా ఉన్న ఆమె త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
పాన్ ఇండియా స్టార్ హీరోతో అఫైర్..
గతంలో అనుష్క శెట్టి ఓ పాన్ ఇండియా స్టార్ హీరోతో అఫైర్‌లో ఉన్నారనే వార్తలు సంచలనం రేపాయి. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఆ వార్తలు జాతీయ స్థాయిలో కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే ఆ విషయంపై ఆ హీరో గానీ, అనుష్క గానీ స్పందించకపోవడంతో కొంతకాలానికి ఆ ప్రచారం తగ్గిపోయింది. కెరీర్ పరంగా చూస్తే అనుష్క ఇటీవల కాలంలో సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పాటు ఇతర పనులపై దృష్టి పెట్టారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి స్థిర ఆదాయం పొందుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా సురక్షిత స్థితిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా అనుష్క ఈ ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కుటుంబంలోనే దగ్గరి బంధువుతో ఆమె వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వ్యాపార రంగంలో స్థిరపడిన బిజినెస్ మ్యాన్ అని కూడా కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి.
నిజం ఎంత ఉంది..
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. అనుష్క శెట్టి లేదా ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తేనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇక అనుష్క కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల ఆమె “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ప్రస్తుతం మలయాళంలో తెరకెక్కుతున్న “కథనార్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరోవైపు కొన్ని కొత్త కథలు కూడా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.
