Baahubali The Epic | ‘బాహుబలి: ది ఎపిక్’ థియేట‌ర్‌లో మిస్ అయ్యారా.. ఓటీటీలో ఎప్ప‌టి నుండి చూడొచ్చు అంటే…!

Baahubali The Epic | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బాహుబలి ఫ్రాంచైజీ భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఎపిక్ హిస్టారికల్ హిట్. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.

  • By: sn |    movies |    Published on : Nov 25, 2025 4:00 PM IST
Baahubali The Epic | ‘బాహుబలి: ది ఎపిక్’ థియేట‌ర్‌లో మిస్ అయ్యారా.. ఓటీటీలో ఎప్ప‌టి నుండి చూడొచ్చు అంటే…!

Baahubali The Epic | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన బాహుబలి ఫ్రాంచైజీ భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఎపిక్ హిస్టారికల్ హిట్. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల మేకర్స్ ఈ రెండు భాగాల హైలైట్స్‌ను ఒకే చిత్రంగా కట్ చేసి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. అంచనాలకు మించి స్పందన రావడంతో, రీ-రిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఇండియన్ సినీరంగంలో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

ఇప్పుడు ఓటిటి ఎంట్రీకి రెడీ!

థియేటర్లలో విజయవంతంగా రాణించిన ఈ స్పెషల్ ఎడిషన్ సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్‌కి సిద్దమవుతుందన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. సాధారణంగా బాహుబలి 1 & 2 డిజిటల్ హక్కులు హాట్‌స్టార్ దగ్గర ఉన్నాయి. అందుకే ఒకే పార్ట్‌గా విడుదలైన ‘బహుబలి: ది ఎపిక్’ హక్కులు కూడా అక్కడే ఉన్నాయని సమాచారం.

హిందీ వెర్షన్ ఎక్కడ?

ఇక్కడే ఆసక్తికర ట్విస్ట్ ఏమిటంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ హక్కులు హాట్‌స్టార్ దగ్గర ఉండగా, హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో బలమైన సమాచారం వినిపిస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచే ఈ ఎపిక్ సినిమా ఓటిటిలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని బజ్. త్వరలోనే ఒక అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.

థియేటర్లలో ఘనవిజయం సాధించిన ‘బాహుబలి: ది ఎపిక్’, ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్‌తో మరోసారి ప్రేక్షకులకు మహోన్నత విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది. అఫీషియ‌ల్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రీ-రిలీజ్ చిత్రం సుమారు 53 కోట్ల రూపాయల గ్రాస్ రాబ‌ట్టిన‌ట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్క‌ల‌తో బాహుబలి సిరీస్‌కు ప్రజలలో ఉన్న కల్ట్ ఫాలోయింగ్‌ను మరోసారి నిరూపించింది.