Sudigali Sudheer | సుధీర్ పిసినారి అంటున్న రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ..రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా..
Sudigali Sudheer | తెలుగు టెలివిజన్ రంగంలో సంచలన విజయాన్ని అందుకున్న కామెడీ షో జబర్ధస్త్ ఎంతోమంది జీవితాలను మార్చింది. ఈ వేదికపై వెలుగులోకి వచ్చిన అనేక మంది కళాకారులు ఇప్పుడు హీరోలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో గెటప్ శీను, సుడిగాలి సుధీర్,ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు ఉన్నారు
Sudigali Sudheer | తెలుగు టెలివిజన్ రంగంలో సంచలన విజయాన్ని అందుకున్న కామెడీ షో జబర్ధస్త్ ఎంతోమంది జీవితాలను మార్చింది. ఈ వేదికపై వెలుగులోకి వచ్చిన అనేక మంది కళాకారులు ఇప్పుడు హీరోలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో గెటప్ శీను, సుడిగాలి సుధీర్,ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు ఉన్నారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముగ్గురు తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నారు. సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా, యాంకర్‌గా సినిమాలు, షోలతో బిజీగా ఉన్నారు. గెటప్ శ్రీను జబర్దస్త్‌ను వీడి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. రామ్ ప్రసాద్ మాత్రం సినిమాలు చేస్తూనే జబర్దస్త్‌లో కొనసాగుతున్నారు.
ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ త్రయం మధ్య సరదా సంఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఇటీవల రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి సుమ కనకాల యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్‌పై సరదా వ్యాఖ్యలు చేశారు.
వారి మాటల్లో..
“మా ముగ్గురిలో సుధీర్ పిసినారి. ఇప్పటికీ ఫోన్ పే, గూగుల్ పే వాడడు. ఎవరైనా డబ్బుల విషయం మాట్లాడితే ‘మా నాన్నతో మాట్లాడండి’ అంటాడు. బయటకు వెళ్తే కార్డు వాడతాడు కానీ మాతో వస్తే అది కూడా తీసుకురాడు” అంటూ నవ్వులు పూయించారు.ఈ వ్యాఖ్యలు సరదాగా చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో చర్చ
ఈ కామెంట్స్ బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “సుధీర్ అంత పిసినారా?” అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, “ఇప్పటికీ ఫోన్ పే వాడడా?” అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇవన్నీ ముగ్గురు మిత్రుల మధ్య సరదా మాటలే అని అభిమానులు భావిస్తున్నారు. జబర్దస్త్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ ముగ్గురు ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ, పరస్పరం ఆటపట్టించుకోవడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram